రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వచ్చే సోమవారం వరకు విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కష్టమైన లాక్ డౌన్ విధించక తప్పడం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేసులు భారీగా పెరుగుతుండటం, బెడ్ల కొరత ఉండటంతో, తప్పనిపరిస్థితుల్లో లాక్ డౌన్ విధించామన్నారు. వలస కూలీలు, కార్మికులు ఢిల్లీలో ఉండాలని, ప్రతిఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేసులు మరింత పెరిగితే, చాలా నష్టపోవాల్సి వస్తదని, ముందస్తుగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ అన్నారు. అత్యవసర సర్వీసులను మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
Must Read ;- డబుల్ మాస్క్‌తో కరోనాకు చెక్