జిల్లాల విభజన కుంపటిలో తగలపడేది అధికారపార్టీనే !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత కేసీఆర్ జిల్లాల పునర్విభజనను చేపట్టారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలు గా విభజించారు. సుదీర్ఘ ప్రజాభిప్రాయ సేకరణ, లోకల్ డిమాండ్స్ స్వీకరణ, మేధావుల సలహాలు, సూచనలు మేరకే 10 జిల్లాలను వివాదాలకు తావివ్వకుండా 33 జిల్లాలుగా విభజించి .. కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా జిల్లాల పునర్విభజను చేపట్టింది. అంతేకానీ ఇలా జగన్ రెడ్డి ప్రభుత్వాలా ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టలేదు. ఏపీలో 25 పార్లమెంట్స్ ను జిల్లాలను చేస్తానన్న జగన్ రెడ్డి హామీ .. 26 జిల్లాలుగా పునర్విభజించారు. తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా ఏర్పాటు చేయాలంటే 13 జిల్లాలను 39 జిల్లాలుగా విభజించాల్సి ఉంటుంది. అప్పుడు డిమాండ్ అధికంగా ఉన్న చోటల్లా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయవచ్చు. కానీ నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న ధ్రోరణిలో జిల్లాలను విభజిస్తే.. ప్రజా వ్యతిరేకత పెల్లుబకడం ఖాయం. ఇప్పటికే సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటనను ఎదర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. ఇంకా గుడ్డెద్దు పొకడలను అవలంబిస్తే పునర్విభజన వివాదం మెడకు చుట్టుకోవడం ఖాయమని విశ్లేషణలు లేకపోలేదు. ఉగాది నాటికి ఏర్పాటయ్యే కొత్త జిల్లాల ప్రక్రియ ప్రజాభిప్రాయాలను కాదని ముందుకు పోతే.. భవిష్యత్తులో మునగక తప్పద అని ఏపీలో అన్ని జిల్లాల నుంచి వస్తున్న విమర్శలే!
రాజంపేటలో కొనసాగుతున్న రగడ..
ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం రగిల్చిన కొత్త జిల్లాల కుంపటి ఆయన ప్రభుత్వాన్ని, పార్టీని దహించకమానదు అన్నట్లు సంకేతాలిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ( పల్నాడు ), కృష్ణా, పశ్చిమ, విశాఖ, విజయనగరం జిల్లాలో అసంబద్ద విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొన్నిచోట్లు జిల్లా కేంద్రాలను పక్క నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని చూడడం, మరికొన్ని చోట్లు జిల్లాలకు పెట్టే పేర్లు, అక్కడక్కడ ఉన్న జిల్లాలోనే తమను కొనసాగించాలని, కొత్త డివిజన్ ఏర్పాటు ఇష్యూలు వంటి సమస్యలపై ప్రజలు రోడ్డెక్కి ఇప్పటికే నిరసనలు తెలుపుతున్నారు. సీఎం సొంత జిల్లా కడపలో రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాని డిమాండ్ చేస్తూ జేఏసీ నేతలు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శాంతియుతంగా చేస్తున్న పాదయాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పలువురును పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. ఇలా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జగన్ రాజేసిన కొత్త జిల్లాల కుంపటి.. రావణకాష్టంలా మండుతునే ఉంది!
Must Read:-అయ్యో .. పాపం ఏపీ పోలీసులు! వారి గతి పగవారికి కూడా పట్టకూడదు !!











