నూజెండ్లలో విషాదం
గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని ఐనవోలు వద్దనున్న గుండ్లకమ్మ వాగులో ముగ్గురు ఈతకు దిగి గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు గుర్తించారు. ఒక శుభకార్యానికి వచ్చి సరదాగా వాగులో ఈతకు దిగారు. ప్రమాదవశాత్తు నీటముగినట్లు స్ధానికులు తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి ఐనవోలు ఎస్ఐ అనిల్ కుమార్ చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ లో ఒక మృతదేహం లబించగా.. గల్లంతైన మరో రెండు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతలందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వినుకొండ ఓ శుభకార్యానికి వచ్చి, ఈతకు దిగినట్లు తెలుస్తోంది. మృతులు ఆయేషా సిద్ధికా( 19 ), హీనా ( 22 ), ఫీజుల్లా ఖాన్ ( 19 ) గా విచారణలో తెలింది. ఒకేసారి ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.











