సముద్రంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగుంటాయి. మనకు తెలియని విషయాలు, మనకు అవసరమయ్యే అత్యంత విలువైన వస్తువులు, మనకు ఉపయోగపడే అరుదైన చేపలు, జీవాలు అందులో ఉంటాయి. సముద్రంలో చేపల వేటకు వేళ్లే వారికి అప్పుడప్పుడు ఔషధ గుణాలు కలిగిన అరుదైన చేపలు చిక్కుతుంటాయి. వాటికి బహిరంగ మార్కెట్‌లో రూ.లక్షల డిమాండ్ ఉంటుంది. ఆ అరుదైన చేపలను కొనుగోలు చేసి కొన్ని సంస్థలు ఔషధాల్లో ఉపయోగిస్తుంటారు.
పశ్చిమబెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దులోని దీఘా ప్రాంతంలో జలేశ్వర్‌కు చెందిన మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అతనికి తెలియబేక్టీ అనే అరుదైన ఔషధగుణాలు కలిగిన చేప దొరకింది. దాని బరువు 28 కిలోల వరకు ఉంది. అయితే ఈ చేప పొట్టు, తోలును ఔషధాల తయారిలో ఉపయోగిస్తారు. ఆ చేపను మత్స్యకారుడు వేలం వేయగా కిలో రూ.16 వేలకు అమ్ముడుపోయింది. అంటే మొత్తం రూ.4.48 లక్షలకు ఏఎంఆర్ అనే ఓ సంస్థ చేపను కొనుగోలు చేసింది.
భోలా ఫిష్ రూ.40 లక్షలు..
ఇలాంటి ఓ అరుదైన చేప కొన్ని రోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లో ఓ ముసలవ్వకు దొరికింది. పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలోని సుందర్ బన్ అడువుల సమీపంలో ఉన్న సాగర దీవుల్లో ఓ మహిళ చేపలు అమ్ముకుంటూ జీవిస్తుంది. చేపలు పట్టేందుకు నదికి వెళ్లగా తనకు అరుదైన జాతికి చెందిన భోలా ఫిష్ నదిలో తేలుతూ కనిపించింది. వెంటనే దానిని పట్టుకుని ఆ ముసలవ్వ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించింది. 52 కిలోల బరువున్న ఆ చేప మొత్తం రూ.3లక్షలకు అమ్ముడుపోయింది. ఆ చేప తోలు, పొట్టుకు భారీ డిమాండ్ ఉంది. కానీ మార్కెట్‌లో దాని అసలు ధర రూ.40 లక్షల వరకు పలుకుతోందట.











