టీమిండియా ఆసీస్ పర్యటన ఆద్యంతం చర్చనీయాంశం అవుతోంది. మన ఆటగాళ్లు అక్కడ కాలుమోపిన దగ్గరి నుంచి నిత్యం ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న టీమిండియా జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలను ఐసొలేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే! ఇప్పుడు అదే సంఘటన మరో చర్చకు దారితీసింది. అక్కడ మన క్రికెటర్లు బీఫ్ తిన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం.. ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.
కొంపముంచిన అభిమానం…
రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, పృథ్వీ షాలు ఓ రెస్టారెంటుకు వెళ్లారు. వీరంతా ఫుడ్ ఆరగించేసే సమయంలో బిల్లును ఒక అభిమాని చెల్లించాడు. ఆ క్రికెటర్ల బిల్లు ఎంత అయ్యిందని తెలుసుకుని మరీ కౌంటర్‌లో కట్టేశాడు. క్రికెటర్లకు తెలియకుండా 118 ఆస్ట్రేలియన్ డాలర్లు( రూ. 6700) బిల్లు చెల్లించేశాడు. అయితే… కౌంటర్ వద్దకు వచ్చిన క్రికెటర్లకు మీ బిల్లును ఆ వ్యక్తి కట్టాడంటూ నవల్‌దీప్ సింగ్ వైపు చూపించారు. దీంతో రోహిత్ శర్మ, పంత్‌లు నవల్‌దీప్ వద్దకు వచ్చి డబ్బు ఇవ్వబోయారు. అయితే నవల్‌దీప్ అందుకు అభ్యంతరం చెప్పి డబ్బు తీసుకోలేదు. దాంతో అతనికి థాంక్స్ చెప్పారు.
ఎంతపని చేశావయా.. నవల్‌దీప్?
ఫ్యాన్ తాను బిల్లు కట్టిన ఫోటోతో పాటు టీమిండియా క్రికెటర్లు రెస్టారెంట్‌లో కలిసి తింటున్న ఫోటో, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర దుమారం రేగింది. భారత క్రికెటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించారంటూ క్రికెట్ ఆస్ట్రేలియా దర్యాప్తుకి ఆదేశించగా… బీసీసీఐ కూడా ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పింది. ఇప్పటికే ఈ ఐదురుగు క్రికెటర్లు ప్రత్యేకంగా ఐసొలేషన్‌లో గడుపుతున్నారు. ఇప్పుడు ఈ విందు మరో కొత్త చిక్కు తీసుకొచ్చింది. వివాదం మొత్తం రేగడానికి కారణమైన ఈ బిల్లు… ఇప్పుడు రోహిత్ శర్మపై నెటిజన్ల ట్రోలింగ్‌కి కారణమైంది.
అన్నీ నాన్‌వెజ్ వంటకాలే..
మెల్‌బోర్న్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్ సందర్భంగా రోహిత్ శర్మ, అతనితో ఉన్న యంగ్ క్రికెటర్లు.. అన్నీ నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు. రొయ్యలు, పందిమాంసం, ఆవుమాంసం, స్టిర్ ఫ్రైడ్ బీఫ్, బీన్ సాస్, పుట్టగొడుగులు, కోడిమాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్, డైట్ కోక్.. వంటివి ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టింపు లేనప్పటికీ.. బీఫ్‌ను మెనూలో చేర్చడం పట్ల దుమారం రేగుతోంది. మిగిలిన ఆటగాళ్లతో పోల్చుకుంటే.. రోహిత్ శర్మ ఒక్కడి చుట్టే ఈ వివాదం తిరుగుతోంది. రోహిత్ శర్మ బీఫ్ ఆర్డర్ చేశాడనే దుమారం చెలరేగింది. ఇప్పటికే వారంతా ఐసోలేషన్‌లో ఉండగా, ఇప్పుడు ఈ వివాదం రావడం సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. అయితే ఈ బిల్లులో అ డైట్ కోక్స్ మినహా ఒక్క వెజిటేరియన్ ఐటెమ్ కూడా లేకపోవడం విశేషం.
రోహిత్ పై ట్రోలింగుల వర్షం…
‘శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడంటూ’ నెటిజన్లు రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ బీభత్సమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కి ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ‘వడా పావ్ కింగ్’ బీఫ్ తింటున్నాడంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే రోహిత్ శర్మ పూర్తి వెజిటేరియన్ అని, కోడి గుడ్లు తప్ప మాంసాహారం తినడని వాదిస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు. అయితే ఈ బిల్లులో అ డైట్ కోక్స్ మినహా ఒక్క వెజిటేరియన్ ఐటెమ్ కూడా లేకపోవడం విశేషం.