ఎంత తేడా..? ఎంత వ్యత్యాసం..? పాలనలోనే కాదు, ప్రవర్తనలోనూ..హస్తిమశకాంతం తేడా
ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన, జగన్మోహన్ రెడ్డి పాలన తీరుతెన్నులపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది..ఇద్దరి ప్రవర్తన, వ్యవహారశైలిలోని వైరుధ్యాలు, సమస్యల్లో స్పందించే గుణం, బాధితులను ఆదుకునేతీరుపై డిబేట్ చేస్తున్నారు.
సీఎంగా 14ఏళ్ల అనుభవం, ప్రతిపక్ష నేతగా 14ఏళ్ల పోరాటాల్లో ఆరితేరిన చంద్రబాబు ఒకవైపు, అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుని 16నెలలు జైల్లో ఉండి, 13సిబిఐ కేసులు, 9ఈడీ కేసులలో బెయిల్ పై ఉంటూ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరోవైపునా చూస్తూ తామేం కోల్పోయామో తెలుసుకుని మధనపడుతున్నారు.
సంక్షోభాల్లోనే సమర్ధత బైటపడేది.. విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వం రుజువయ్యేది..మన రాష్ట్రాన్ని విపత్తులు, సంక్షోభాలు చుట్టుముట్టడం పరిపాటే.. తుపాన్లు, కరువు, అకాల వర్షాలు ఏటా ఆంధ్రాకొచ్చే అనుకునే అతిథులే… వాటితోనే ఆంధ్రుల సహజీవనమన్నది అందరికీ తెలిసిందే..ఈ పరిస్థితుల్లో ప్రజలను ఒడ్డునపడేయాల్సిన బాధ్యత పాలకులదే, బాధితులకు అండగా ఉండటం, వారిలో భరోసా కల్పించడం ప్రభుత్వాల విద్యుక్తధర్మం..
మూర్ఖుడు పాలకుడైతే ప్రజలెన్ని కష్టాల పాలవుతారో, సమర్ధుడిని దూరం చేసుకుంటే ఎంత చేటువాటిల్లుతుందో గత 4ఏళ్ల ఏపి ముఖచిత్రమే నిదర్శనం..
ఎప్పుడు విపత్తులు వాటిల్లినా, నిముషం వృధా చేయకుండా సహాయ పునరావాస చర్యల్లోకి దూకడంలో, యుద్ధప్రాతిపదికన సాధారణ జనజీవనం పునరుద్ధరించడంలో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు..ఎంత వేగంతో ఆయన పనితీరు ఉంటుందంటే, హుద్ హుద్ ఈదురుగాలులకన్నా మెరుపువేగంగా ఆయన కదుల్తాడనేది ప్రజలందరికీ ఎరుకే..ఉమ్మడి రాష్ట్రంలో 9ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడిలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో తుఫాన్ విలయతాండవం, వరద బీభత్సంలో మొత్తం సెక్రటేరియట్ నే రాజమండ్రిలో మొహరించి తానక్కడే 10రోజులు తిష్టవేసి ఏవిధంగా పరిస్థితులను చక్కదిద్దారో, బాధితులకు అండగా ఉన్నారో, ప్రజల్లో భరోసా నింపారో ప్రత్యక్షంగా చూశాం. అదే కాదు ఒడిశాలో వరద బీభత్సంలో కూడా మన రాష్ట్రంనుంచి వెళ్లి, పోలీసులు, ఇతర శాఖల సిబ్బందిని పంపి ఎలా ఆదుకున్నారో తెలిసిందే.
అధికారంలోనే కాదు, ప్రతిపక్షంలోనూ అదేవిధంగా బాధితులకు అండగా ఉండటం చంద్రబాబు ప్రత్యేకత. కృష్ణా వరద బీభత్సంలో కర్నూలు,మహబూబ్ నగర్ సహా 5జిల్లాలు అతలకుతలమైనప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి కర్నూలు వీధుల్లో నడుం లోతు పేరుకుపోయిన బురద మేటలను తొలగింపజేసి ఏవిధంగా బాధితులకు అండగా నిలిచారో విదితమే..అదేవిధంగా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న చార్ థామ్ యాత్రీకులను క్షేమంగా రాష్ట్రానికి రప్పించి స్వస్థలాలకు చేర్పించిన ఘనత చంద్రబాబుదే.. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో గల్లంతైన విద్యార్ధుల కుటుంబాలకెలా అండగా నిలబడ్డాడో చూశాం..
తెలుగు వారికెక్కడ ఆపద వాటిల్లినా తానధికారంలో ఉన్నా, లేకున్నా రెక్కలుగట్టుకుని వాలి, బాధితుల చెంత చేరి, వారిని స్వాంతనపర్చి, భవిష్యత్ పై నమ్మకం పెంచేలా చంద్రబాబు స్వభావాన్ని, పనితీరును ప్రత్యర్ధులు కూడా మెచ్చుకోవడం కద్దు..ఆపద్భాంధవుడని, అనాధ రక్షకుడనేది ఆయన్ను అందుకే..
హుద్ హుద్ తుపాన్ బీభత్సంలో 250కిమీ వేగంతో ఈదురుగాలులు విశాఖను అల్లాడిస్తే, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలు వణికిపోతే, ముఖ్యమంత్రిగా నేనున్నానంటూ, అధికారులు వారించినా వినకుండా రోడ్డుమార్గంలోనే వెళ్లి కొన్ని గంటల్లోనే విశాఖ చేరుకుని మొత్తం యంత్రాంగాన్ని అక్కడే మొహరించి 12రోజుల్లో ఏవిధంగా విశాఖను సాధారణ స్థాయికి తెచ్చారో కళ్లముందే ఉంది.
రోడ్లకు అడ్డంగా కూలిన వృక్షాలను స్వయంగా తానే రంపం చేతబట్టి తొలగించాడు, పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టే బాయ్ అయ్యాడు..గూడు చెదిరిన బాధిత ప్రజల ఆకలితీర్చే సర్వర్ అయ్యాడు. కూలిన కరెంటు స్తంభాలను మోసే కూలీల్లో ఒకడయ్యాడు. పంట నష్టపరిహారం పెంచి రైతులను ఆదుకున్నాడు, నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసి పేదలకు అండగా నిలిచాడు. కూలిన ఇళ్ల స్థానంలో కొత్తఇళ్లు నిర్మించారు.
తిత్లీ తుఫాన్ తో తల్లడిల్లిన శ్రీకాకుళం జిల్లాలోనే 12రోజులు మకాం వేసి, మొత్తం యంత్రాంగాన్ని అక్కడే మొహరించి అదే ధైర్యంతో, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో యుద్ధప్రాతిపదికన సహాయ పునరావాస చర్యలు చేపట్టి అన్ని మండలాల్లో జన జీవనాన్ని సాధారణ స్థాయికి తెచ్చాడు. పండగ పూట ఇంటికెళ్లకుండా కుటుంబ సభ్యులనే ఇక్కడికి రప్పించి విపత్తు బాధితులతోనే పండగ నాడు గడపిన చంద్రబాబు సేవానిరతికి మచ్చుతునక.
అలాంటిది ప్రస్తుతం అకాల వర్షాలతో రాష్ట్రంలో 4లక్షల ఎకరాల్లో పైగా ధాన్యం, మొక్కజొన్న, పత్తి, మిర్చి, మామిడి, టమాటో తదితర పంటలన్నింటికీ తీవ్ర నష్టం వాటిల్లితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం బాధిత ప్రాంతాల్లో పర్యటించకపోవడం, బాధితులను పరామర్శించక పోవడం పదవికే కళంకం, నిర్లక్ష్యానికి నిలువుటద్దం..గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా నిర్దయగా, కర్కశంగా ప్రవర్తించిన దాఖలా లేదు.
తాను పర్యటనకు రాకపోగా, పలకరించకపోగా, బాధితుల్లో భరోసా నింపేందుకు, పంట నష్టం పరిశీలనకు వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం, ఆంక్షలు విధించడగం అమానవీయం, గర్హనీయం..రామచంద్రాపురం నియోజకవర్గంలో పంటపొలాలకు వెళ్లనీకుండా బారికేడ్లు కట్టడం, ఆయన కాన్వాయ్ లో ప్రచార రథాన్ని అనుమతించక పోవడం, సీజ్ చేస్తామన్న బెదిరింపులను ఎలా చూడాలి, ఏమనాలి..? ఇంతకన్నా ప్రజాకంటక ప్రభుత్వం, రాక్షస పాలన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ఆయా వర్గాల ప్రజలే ప్రశ్నిస్తున్నారు..నలుగురూ నవ్విపోదురు నాకేటి సిగ్గనట్లే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది..
భోగాపురం ఎయిర్ పోర్టుకు చేసిన శంకుస్థాపనలే మళ్లీ చేస్తూ నగుబాటు పాలైన జగన్ పక్కనే ఉన్న అకాల వర్ష బాధిత రైతాంగాన్ని పలకరించక పోవడం, పంటనష్టాన్ని పరిశీలించక పోవడం రైతు ద్రోహమే కాదు ప్రజాద్రోహం కూడా..ఇప్పుడే కాదు, గతంలో కూడా పాదయాత్ర చేస్తూ విజయనగరం వచ్చికూడా జగన్మోహన్ రెడ్డి ఆ పక్కనే సిక్కోలు తిత్లీ తుఫాన్ ప్రాంతాల్లో పర్యటించక పోవడాన్ని, బాధిత ప్రజానీకాన్ని పరామర్శించకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన మొదట్లో ఇలానే భారీ వర్షాల్లో కృష్ణా డెల్టా మొత్తం అతలాకుతలమై, లంకన్నీ నీటమునిగి అల్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలకెళ్లడాన్ని ఉదహరిస్తున్నారు..
గత నాలుగేళ్లలో అనేక విపత్తులొచ్చినా, ఏదో ఏరియల్ సర్వేలే తప్ప, ఏ విపత్తులోనూ క్షేత్రస్థాయిలో బాధితులను పలకరించలేదనేది అక్షర సత్యం..ఇలాంటి నిర్లక్ష్యం, మూర్ఖత్వం, అహంభావ ముఖ్యమంత్రిని మున్నెన్నడూ చూడలేదు.. బాధితులంటే చులకన అనాలా, జనం బాధల్లో ఉంటే ఆనందించే సైకో జగన్ అనాలా…?
‘‘రోమ్ నగరం తగులబడ్తుంటే ఫిడేల్ వాయించిన నీరోను’’ మించిన పాలకుడు జగన్మోహన్ రెడ్డనేది ప్రజల్లోకి బలంగా వెళ్లింది..ఇలాంటి ముఖ్యమంత్రి దాపురించడం తమ ప్రారబ్ధమనే భావన సర్వత్రా నెలకొంది. ఎప్పుడెప్పుడీ పార్టీని, పాలకుడిని ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్నారు.
విజయసాయి రెడ్డి సీరియస్ జోక్ జగన్ నమ్ముతాడా..??
హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మరోసారి ఈవీఎం ల గురించి...