ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కరోనా టీకా వికటించింది. ప్రభుత్వ యువ డాక్టర్ ధనలక్ష్మికి గత శనివారం కరోనా టీకా ఇచ్చారు. ఆ మరుసటి రోజు నుంచి ఆమె బీపీ దారుణంగా పడిపోయింది. దీంతో ఆమెకు జీజీహెచ్ లో చికిత్స అందించారు. సీరియస్ కావడంతో ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించినా ధనలక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో డాక్టర్ ధనలక్ష్మిని ప్రత్యేక సౌకర్యాలు కలిగిన అంబులెన్సులో చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
టీకా వికటించడం వల్లే
డాక్టర్ ధనలక్ష్మికి టీకా ఇచ్చిన తరవాతే ఆమె ఆరోగ్యం క్షీణించిందని జీజీహెచ్ వైద్యులు ధృవీకరించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరవాత బీపీ బాగా పడిపోవడంతోపాటు, ఆమెకు తీవ్ర జ్వరం వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన జీజీహెచ్ డాక్టర్లు వైద్యం అందించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
Must Read ;- ఏపీలో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత