నేడు వేసే ఒక్కో ఓటు.. రేపటి భవిష్యత్తుకు దారి చూపిస్తుందని, అమూల్యమైన ఓటుతో అభివృద్ధికి అండగా నిలవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఓటు వినియోగంలో నిర్లక్ష్యం తగదన్నారు. మీరు వేసే ఓటే అభివృద్ధికి తోడ్పడుతుందని, మీ పిల్లల భవిష్యత్తుకు పునాదవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Must Read ;- ఓట్లతో వైసీపీ రౌడీయిజం అంతం చేయండి.. గుంటూరు రోడ్ షోలో చంద్రబాబు పిలుపు