తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. అప్పుల కుప్పగా మారింది. కోట్ల రూపాయలు అప్పులు చేసిన ప్రభుత్వం ఆర్థికం గా ఎలా బయటకి రావాలో తెలిక కొట్టుమిట్టాడుతోంది. అప్పు చేసి పప్పుకూడు అన్ని రీతిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారడం తో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం లో ప్రభుత్వం భూములు అమ్మి ఆర్థికంగా ఎదిగేందుకు ఆలోచనలు చేసిన సరిపోయే పరిస్థితి లేదు. ఆర్టీసీ ఆస్థులకు సైతం అమ్మకం లేదా లీజ్ కు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం
శ్రీలంక లో జరిగిన పరినామాలు తెలంగాణ రాష్ట్రం లో తలెత్తుతాయని తెలుస్తుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే కచ్చితంగా కోట్లాది రూపాయలు అవసరం అని తాజాగా సీఎం కేసీఆర్ కు తెలిసినట్లుంది. రాష్ట్రం ఏర్పడిన తొలినాల్లలో కోట్ల రూపాయలు మిగులు ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రం గా మారిందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారు.తలకు మించిన పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అదోగతం పాలు చేశారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్,టీడీపీ పాలనలో ఏనాడు ఇటువంటి పరిస్థితి లేదని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని బీజేపీ సీనియర్ నాయకురాలు సినీనటి విజయశాంతి జోస్యం చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే కనీసం 5 వేల కోట్ల రూపాయలు అత్యవసరమన్నారు. లేదంటే ఆ సంక్షేమ పథకాలు నిలిచిపోవాల్సిందేని వివరించారు. మరో వైపు సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ వద్ద అప్పులు తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటికే అప్పులు పెరిగిపోగా మరోసారి అప్పులు చెల్లించేందుకు అంగీకరించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే రాష్ట్రం లో ప్రభుత్వం ఉద్యోగులకు సరియైన సమయం లో వేతనాలు చెల్లించడం లేదని అపవాదు ఉంది. జిల్లాల్లో పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం తోపాటు ఆర్టీసీ లో పని చేస్తున్న కార్మికులకు, ఇతరులకు సరియైన తేదీల్లో జీతాలు ఇవ్వడం లేదు. కారణం రాష్ట్ర ఖజాన పూర్తిగా దివాలా తీయడమే అని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథాకలు అమలు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్నది వేయి కోట్ల ప్రశ్న.ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రనాళికలు చేస్తారు ఎలా వ్యవహరిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.