గత నలభై రోజులుగా రాజమండ్రి జైలులో అక్రమ అరెస్ట్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీం కోర్గు శుక్రవారం తీర్పు వెల్లడించనుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.. ఇప్పటికే పలు దఫాలుగా ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.. బుధవారంతో ఇరు పక్షాల ప్రత్యక్ష వాదనలు విన్న సుప్రీం కోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది.. శుక్రవారం తీర్పు వెలువరించే చాన్స్ ఉంది.. దీంతో, సుప్రీం తీర్పు వస్తే ఏం చేయాలి.?? ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంతో ముఖ్యమంత్రి జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.. డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డితోపాటు మరికొందరు అధికారులతో జగన్ సమీక్ష జరిపారు..
ఈ సమావేశంలో తీర్పు చంద్రబాబుకి అనుకూలంగా వస్తే, తిరిగి ఏం చేయాలి…?? అనే అంశంపై ఆయన ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది.. మరలా కోర్టు తలుపు తట్టడంతోపాటు ఇతర ఆప్షన్స్‌ని ఆయన అన్వేషించాలని న్యాయవాదులకు సూచించినట్లు సమాచారం.. మరోవైపు, డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డితోనూ జగన్ అత్యవసరంగా భేటీ అవడం చర్చనీయాంశంగా మారుతోంది..
ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులపాటు 144 సెక్షన్ విధించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది… అంటే, టీడీపీ అధినేత కోర్టు నుండి విడుదలయితే, ఎలాంటి రోడ్డు షోలు, ప్రదర్శనలు, ర్యాలీలు లేకుండా తీవ్ర, కఠిన ఆంక్షలు విధించాలని భావిస్తున్నారట. కోర్టు నుండి విడుదలయిన తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకోవడం, ప్రజలు రోడ్డు మీదకు రాకుండా నిలువరించడం లాంటి అంశాలపై దృష్టి పెట్టాలని డీజీపీకి సూచించినట్లు తెలుస్తోంది..
మరోవైపు, చంద్రబాబు కేసుపై టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఎలాంటి ఆధారం లేని కేసులో దాదాపు 40 రోజులుగా జైలులో ఉన్న తమ అధినేతకు సుప్రీంలో తీర్పు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు.. ఆయన బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.. అందుకే, వీటిని నిలువరించే ఆలోచనతోనే డీజీపీతో జగన్ సమీక్ష జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.. మరి, శుక్రవారం ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి..