విశాఖలో కార్మిక సంఘాలు నిర్వహించిన రాస్తారోకో ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్కసారీగా వేల సంఖ్యలో ఉక్కు ఉద్యమకారులు నిరసన స్వరం పెంచారు. నిరసనల హోరుతో రోడ్లెక్కారు. ఈ పరిణామాన్ని ఊహించని పోలీసులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక సంఘాలతో నిరసనలో పాల్గొంటున్న వామ పక్షాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొంత కాలంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, వామ పక్షాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. కానీ కేంద్రం మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుంది.. విశాఖ ఉక్కు ధర నిర్ణయించడానికి కమిటీని కూడా నియమించి.. తన పని తాను చేసుకుపోతుంది. ఇంకోవైపు.. విశాఖ ఉక్కును పోస్కో కంపెనీకి కట్టబెడుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..Must సంస్థ ఏపీలో పర్యటిస్తుంది.. ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తుంది. వీటిపై తీవ్రంగా ఆగ్రహించిన విశాఖ ఉక్కు నిరసన కారులు.. తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేశారు.
Must Read ;- వీరికి పోస్కోపై ఎందుకంత ప్రేమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!