మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ కండువా కప్పి ఆయనను ధర్మేంద్ర ప్రధాన్ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీని విస్తరించడం కోసం తనవంతుగా పనిచేస్తానని అన్నారు. బీజేపీ లక్ష్యాలకనుగుణంగా, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఆదేశాల మేరకు పార్టీ పటిష్టత కోసం పాటుపడుతానని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలో పర్యటించి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్తానని ఈటల రాజేందర్ అన్నారు.
Must Raead ;- బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల.. చూడాల్సింది హుజూరాబాద్‌లో రాజకీయ కురుక్షేత్రమే!