బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఆతర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాలో నటించడాకి ఓకే చెప్పిందట. అది ఎన్టీఆర్ తోనా..? రామ్ చరణ్ తోనా..? అనేది ఆసక్తిగా మారింది.
బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ.. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించింది. తొలి సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఆతర్వాత మళ్లీ తెలుగు సినిమాలో అవకాశాలు వచ్చినా నటించలేదు. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ అమ్మడుకు క్రేజ్ బాగా పెరిగింది. ఇటీవల కియరా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఏడు సంవత్సరాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు కియరాను అభినందిస్తూ మెసేజ్ లు పంపించారట. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కియరాను మళ్లీ సౌత్ సినిమాలో నటించమని కోరుతూ అభిమానలు పోస్ట్ లు పెట్టారు. ఈ పోస్ట్ లకు కియరా స్పందిస్తూ… సౌత్ సినిమా చేయబోతున్నాను. త్వరలోనే ఆ సినిమా ఏంటి అనేది అనౌన్స్ చేస్తానని ట్వీట్ చేశారు. ఇలా పోస్ట్ పెట్టినప్పటి నుంచి కియరా చేయనున్న సౌత్ సినిమా ఎన్టీఆర్ తోనా..? రామ్ చరణ్ తోనా..? అనేది ఆసక్తిగా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. అలాగే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేయనున్నారు.
అయితే.. ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కాలేదు. అలాగే రామ్ చరణ్ – శంకర్ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది కన్ ఫర్మ్ కాలేదు.
అందుచేత కియరా చేయనున్న సినిమా ఎన్టీఆర్ తోనా..? రామ్ చరణ్ తోనా..? అనేది ఆసక్తిగా మారింది. కియరా తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ. అందుచేత ఎన్టీఆర్ తో కొరటాల తెరకెక్కించే సినిమాలో కియరా నటించే ఛాన్స్ ఉందంటున్నారు. మరి.. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- గుణశేఖర్ ‘ప్రతాపరుద్రుడు’ ఇతడేనా?











