ఈ ఫొటోలను చూస్తుంటే ‘ఆహా.. ఏమి ఈ కుక్క బతుకు’ అనిపించడం లేదూ! సినిమాల్లో కనిపించే అందాల చందమామలు ఈ కుక్క పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో ఈ ఫొటోలు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఈ కుక్కల ప్రేమ ముంబయిదాకా వెళ్లిపోయింది. ఎలా అంటే ముంబయిలో ఛార్మి, రష్మిక కలుసుకోవడమే కాదు తాము అల్లారు ముద్దుగా పెంచుకునే కుక్క పిల్లలతో బొమ్మలాట ఆడుకున్నారు కూడా.

ఈ లాక్ డౌన్ సమయంలో వీరికి ఇవి భలే కాలక్షేపాన్ని ఇచ్చాయట. ఎంతో విశ్వాసం చూపించే కుక్కల మీద ఈ మాత్రం లేకపోతే ఎలా చెప్పండి. ఇక నటి వరలక్ష్మీ శరత్ కుమార్ అయితే మరో సోనూ సూద్ అనుకోవాలి. కరోనా సమయంలో ఆయన మనుషులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తే వరలక్ష్మీ మాత్రం కుక్కలను ఆదుకోడానికి ప్రయత్నించింది. వీధి కుక్కలకు ఆహారం అందించి వార్తల్లోకి ఎక్కింది.

కుక్కలే కాదు పిల్లుల్ని సైతం ఆమె వదల్లేదు. జంతు ప్రేమికుల జాబితాలో వరలక్ష్మి చేరుతుందనడం అతిశయోక్తి కాదు. అంతెందుకు ఆదివారం వస్తే ఆమెకు కుక్కలే కాలక్షేపం. ఆమె నిక్షేపంగా వాటితో ఎంజాయ్ చేసేసింది. నిన్న ఆదివారం అక్కడ వరలక్ష్మి, ముంబయిలో ఛార్మి, రష్మిక కుక్కలతో ఇలా మనకు ఫొటోలు అందించారు.
Must Read ;- ఒబామా పెంపుడు కుక్క మృతి : మంచి ఫ్రెండ్ ను కోల్పోయానంటూ ఎమోషన్











