సమంత మళ్లీ ఒకసారి గ్లామర్ తో తళుక్కున మెరిసింది .. సినిమా కోసం కాదు, ‘ది మిర్రర్’ అనే మేగజైన్ కోసం. అది కూడా సమంత స్పెషల్ ఇంట్రెస్ట్ కాదు .. తన స్నేహితురాలైన అర్పిత మెహతా కోసం కెమెరా ముందుకు వచ్చింది. ఫ్యాషన్ డిజైనర్ అర్పిత మెహతా పేరును వినే ఉంటారు. చాలామంది స్టార్ హీరోయిన్లకు ఆమెనే ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తోంది. అలా ఆమె తన కెరియర్ ను ఆరంభించి పదేళ్లు పూర్తయింది.
ఫ్యాషన్ డిజైనర్ గా పదేళ్లను పూర్తిచేసిన సందర్భంగా ఆమె ఒక ప్లాన్ చేసింది. తాను ఏయే స్టార్ హీరోయిన్స్ కి ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరిస్తోందో, తన డిజైనర్ డ్రెస్ లతో వాళ్ల గ్లామరస్ ఫొటోలను ‘ది మిర్రర్’ మేగజైన్ ద్వారా ఆవిష్కరించాలని భావించింది. అలా ఒక్కొక్కరికీ ఫొటో షూట్ నిర్వహిస్తూ వస్తోంది. తాజాగా ‘ది మిర్రర్’ మేగజైన్ కోసం సమంతపై ఫొటో షూట్ ను నిర్వహించింది. అర్పిత మెహతా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో సమంత మెరిసిపోతోంది.
అర్పిత మెహతా డిజైన్ చేసిన డ్రెస్ వలన సమంత అందం పెరిగిందా? సమంత ధరించడం వలన ఆ డ్రెస్ అందంగా కనిపిస్తుందా? అనే ఆలోచనలో పడేస్తోంది. మత్తుకళ్లతో మధువులను ఒలకబోస్తూ .. సమంత ఈ ఫొటోకి మరింత జీవం పోసింది. అభిమానుల మనసు మైదానంలో మరోసారి వెన్నెల కురిపించింది .. వాడని వసంతమే తెచ్చింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో సినిమాలను .. గ్లామర్ రోల్స్ ను తగ్గించిన సమంత, ఒక్కసారిగా వెన్నెల్లో వెన్నముద్దలా మెరవడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Must Read ;- సమంత @ 15 మిలియన్స్











