తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వైద్యశాఖను కేసీఆర్ కు బదిలీ చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనేంటో ప్రజలకు తెలుసనని, కావాలనే ప్లాన్డ్ గా చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు. 25 ఏళ్ల చరిత్రలో నాపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి అని అయన అన్నారు. కుట్రపూరితంగా ఇలాగా వ్యవహరిస్తే.. ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. శాఖ లేకున్నా.. తాను ప్రజాసేవా చేస్తానని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన అన్నారు. తన నియోజకవర్గ ప్రజలతో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిమానులు, అనుచరులతో కూడా చర్చిస్తానని తెలిపారు.
ఈటల శాఖ కేసీఆర్ కు : అమీతుమీకి ఈటల సిద్ధం