రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు బదిలీ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేరకు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయంతో ఈటల రాజేందర్ వైద్యశాఖను కోల్పోయారు. భూకబ్జా ఆరోపణలపై ఏసీబీ, సీఎస్ విచారణ మొదలుపెట్టారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కు నివేదిక అందజేయనన్నట్లు సమాచారం. భూకబ్జా ఆరోపణలు రావడం, విచారణ మొదలు పెట్టడం, వైద్యశాఖ నుంచి తొలగించడం లాంటివి…. ఈటలను షాక్ గురిచేశాయి. వేటుపడిన విషయం తెలుసుకున్న ఈటల స్సందిస్తూ.. తనకు ఆ విషయం తెలియదని, వేటు పడిన విషయం నిజమైతే తాను సంతోషిస్తానని అన్నారు.
Must Read ;- రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు : ఈటల