ఈ ఆక్రమణ వెనుక కుట్ర ఉందని ఈటల ఆరోపిస్తున్నారు. తాము అన్నీ నిబంధనల ప్రకారమే కొన్నామన్నారు. ఇప్పటికీ ఆ భూములు వారి వద్దే ఉన్నాయన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేపు ఉదయం ఫీల్డ్ విజిట్చే యాలని సూచించారు.
1994నుంచి ఆ భూములు పనికి రావడం లేదని రైతులు చెబితే.. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడమే మార్గమని సూచించారన్నారు. కాగా తన భూమిలోనుంచే రింగ్రోడ్డు పోయిందని, తానే నష్టపోయానని వ్యాఖ్యానించారు. ఈటల రాజేంద్ర భూమిని కోల్పోయినా పర్వాలేదని, ఆత్మను మాత్రం కోల్పోనని వ్యాఖ్యానించారు. ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. 2004నుంచిన్ని లక్షలమందితో మీటింగ్ పెట్టినా భోజనం పెట్టే పంపిస్తామని వ్యాఖ్యానించారు. సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి విచారణ జరపాలని కోరుకుంటున్నానరు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం లొంగేది లేదని వ్యాఖ్యానించారు. ఎవరి చరిత్ర ఏంటో తెలుసునని వ్యాఖ్యానించారు. మీరు పెయిడ్ ఛానెళ్లని, విచారణ, వివరణ ఉండాలని వ్యాఖ్యానించారు.
ఇదీ విషయం.. మెదక్ జిల్లా ముసాయిపేట మండలంలో అచ్చంపేట,హకీంపేట గ్రామాల్లో సర్వే నెంబర్లు 130/5, 130/10, 64/6 సర్వే నెంబర్లలో గల భూమిని మంత్రి కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి తోపాటు పలువురు రైతులు లింగయ్య, చాకలి బిచ్చవ్య, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరుశురాం, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఘటనపై కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ ఒత్తిళ్లు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పడంతో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
Must Read ;- ఈటల ఏమిటిలా.. ప్రభుత్వంపై తిరుగుబాటా..?











