కొవిడ్, కరోనా… ప్రపంచమంతా తిరిగినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు మాటలు తప్ప వేరేవి వినిపించవేమో అనిపిస్తుంది. మాస్క్ ధరించడం, శానిటైజర్ రాసుకోవడం అనేవి మనిషి దినచర్యలో భాగంగా మారిపోయాయి. ఏడాది వయసు పూర్తి చేసుకున్న కరోనా… నేటికీ మానవాళిని చిగురుటాకులా వణికిస్తోంది. ఒకానొక దశలో బాగా తగ్గుముఖం పట్టినట్లుగా అనిపించినా… సెకండ్ వేవ్ పేరుతో మరో విడద బాదుడు మొదలు పెట్టిందీ ఈ మహమ్మారి. ప్రపంచంలో నమోదవుతున్న కేసులు, సంభవిస్తున్న మరణాలు గమనిస్తే, ఐరోపా ఖండంలో దాదాపు 70 శాతం పైగా నమోదవుతున్నాయని చెప్పొచ్చు. ఐరోపా దేశాలే ఎందుకు అంతగా ప్రభావితమవుతున్నాయి? వీటికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
వాతావరణ ప్రభావం
ఐరోపా ఖండంలోని దేశాల్లో చాలా చల్లని వాతావరణం ఉంటుంది. కరోనా ఇలాంటి వాతావరణంలో చాలా సులభంగా మనగలిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తూనే ఉన్నారు. మరి వాతావరణం అంతగా సహకారాన్ని అందిస్తే కరోనాని కట్టడి చేయడం ఎవరి తరమైనా అవుతుందా. దానికి తోడు చలికాలం, ఇక కరోనా కట్టడి అనే మాటే లేకుండా పోయింది. ఐరోపాలోని దాదాపు అన్ని దేశాలు ఫ్రాన్స్, ఇటలీ, పోలాండ్, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, జర్మని, యుకే దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.
Must Read: కరోనాకి వ్యాక్సిన్ రాదంటున్న నందమూరి బాలకృష్ణ?
నిర్లక్ష్యం ఖరీదు
కరోనా ధాటికి అందరూ భయపడుతున్న సమయంలో ఈ దేశాలు కోవిడ్-19ను సాధారణ వైరస్‌గా భావించాయి. దాని వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించలేదు. ప్రపంచంతా లాక్ డౌన్‌లను ప్రకటించుకుని, క్వారంటైన్‌ను పాటిస్తున్న సమయంలో కూడా ఐరోపాలోని కొన్ని దేశాలు కొవిడ్‌ను లెక్కచేయలేదనేది నిజం. కరోనా కేసులతో హాస్పిటల్స్ చాలక, చనిపోయిన వారి లెక్కలు అంతకంతకూ పెరిగిన తర్వాత కానీ వాళ్లు కళ్లు తెరవలేదు. అప్పుడు తెలుసుకున్నా ఉపయోగం శూన్యం. సెకండ్ వేవ్‌కి అప్రమత్తంగా ఉన్నా కూడా చలికాలం, కరోనా కలిసి ప్రజల పాలిట శాపంగా మారాయి. పూర్తి లాక్ డౌన్‌ను భరించగలిగే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కాబట్టి లాక్ డౌన్ అనే మాట పక్కన పెట్టాల్సి వచ్చింది.
రోగ నిరోధక శక్తిదే ముఖ్యపాత్ర
మన శరీరంలోకి ప్రవేశించే ఎటువంటి వైరస్‌లను అయినా రోగ నిరోధక శక్తి ఎదిరించి పోరాడుతుంది. కాబట్టి కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం. కరోనా కోరలకు బలవుతున్న ఈ దేశాలకు చెందిన ప్రజల్లో వైరస్‌తో పోరాటే సహజ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం అతి పెద్ద కారణంగా చెప్పొచ్చు. ఎన్ని మందులు వాడినా… వారి ఆహార నియమాలు వారి రోగ నిరోధక శక్తిని నిర్ణయిస్తాయి. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు కూడా కరోనా యథేచ్ఛగా స్వైరవిహారం చేయడానికి కారణమనే అనాలి.
Also Read: నాడు హుద్ హుద్.. నేడు కరోనా