ఒకవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు సీఎం జగన్ మోదీ భజన చేస్తున్నాడని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తూ దోపిడీకి పాల్పడటంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. కరోనా విలళంపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఆర్టిక్సల్ ను షేర్ చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మొద్దునిద్ర వీడాలన్నారు. ‘‘కరోనాతో చావులోనూ ప్రశాంతత కరువు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డిమాండ్ చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువ కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి. ప్రభుత్వాసుపత్రుల ఎదుటే యధేచ్ఛగా దందా. ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినబడుతుందా? వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
కరోనాతో చావులోనూ ప్రశాంతత కరువు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డిమాండ్. చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువ.కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి. ప్రభుత్వాసుపత్రుల ఎదుటే యధేచ్ఛగా దందా.ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినబడుతుందా ? @ysjagan pic.twitter.com/Fin9SajMtu
— Devineni Uma (@DevineniUma) May 10, 2021