పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే.. భారీ పాన్ ఇండియా మూవీస్ ‘సలార్, ఆది పురుష్’ సినిమాలు రెండింటినీ ట్రాక్ మీద పెట్టాడు. ఒక పక్క ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ చేస్తూనే… మరో పక్క సలార్ షూట్ నూ మేనేజ్ చేస్తూ.. క్లాష్ లేకుండా చూస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారం వరకూ ఆదిపురుష్ షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత రెండో వారంలో ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ లో పాల్గొంటాడు.
సలార్ షెడ్యూల్ కోసం హైద్రాబాద్ లో భారీ సెట్స్ వేస్తున్నారని సమాచారం. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ‘సలార్’ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీగా సలార్ రూపొందుతోంది. మరి ఈ సినిమా ప్రభాస్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- మరో పాన్ ఇండియా సినిమాకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ?