పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శ్రుతి హాసన్ జంటగా.. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ ‘సలార్’. తెలుగుతో పాటు, కన్నడ, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో సైతం విడుదల కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారో అప్పటి నుంచి సలార్ మీద వస్తోన్న క్రేజీ అప్డేట్స్ అభిమానుల్ని తెగ ఊరిస్తున్నాయి. ఈ సినిమా కళ్ళు చెదిరే ఫిగర్స్ తో ప్రీరిలీజ్ బిజినెస్ చేసేస్తోంది.
ఒక పక్క ‘కేజీఎఫ్ 2’ కూడా విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ‘సలార్’ ను అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి.. బయ్యర్స్ సినిమా మీద వందల కోట్లు కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సలార్ సినిమాకి ఓటీటీ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల వారి సమాచారం ప్రకారం.. సలార్ మూవీ థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే స్ట్రీమింగ్ చేసుకోడానికి అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 100కోట్ల ఆఫర్ చేశారట.
బాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాలకే ఈ రేంజ్ లో ఆఫర్ ఇవ్వలేదు అమెజాన్. దాదాపు అన్ని భాష ల్లోనూ ఈ సినిమాను స్ట్రీమ్ చేసుకోడానికి అమెజాన్ ఈ ఆఫర్ నిచ్చిందట. సాహో, కేజీఎఫ్ లు అమెజాన్ ప్రైమ్ లో బ్రహ్మాండమైన వ్యూస్ తెచ్చుకున్నాయి. అందుకే ఈ రెండు సినిమాల హీరో, దర్శకుడి కాంబో మూవీ అయిన సలార్ కు అమెజాన్ అంత రేట్ తో ఆఫర్ ఇవ్వడానికి రెడీ అయిందని సమాచారం. సలార్ ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. అటు థియేటర్స్ లోనూ, ఇటు ఓటీటీలోనూ జాతరే అన్నమాట. మరి సలార్ మూవీ ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్ తో పోటీపడుతున్న ఆ ఇద్దరూ ఎవరు?