గుంటూరు జిల్లా కాజ టోల్ గేటు వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇవాళ సాయంత్రం టోల్ గేటు వద్ద స్కానింగ్ కోసం ఆగిన లారీ నుంచి భారీగా మంటలు ఎగసి పడ్డాయి. గుర్తించిన లారీ డ్రైవరు, క్లీనరు వెంటనే కిందక దిగడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. టోల్ గేటు వద్ద లారీ సడన్ బ్రేక్ వేయడంతో టైరు పేలి మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న లారీ డీజిల్ ట్యాంకుకు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయని టోల్ గేటు సిబ్బంది వెల్లడించారు. రాజమండ్రి నుంచి లారీ మద్రాసు వెళుతుండగా కాజ టోల్ గేటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అదుపులోకి వచ్చిన మంటలు
ప్రమాదం జరిగిన వెంటనే టోల్ గేటు సిబ్బంది, అగ్నిమాపక దళాలకు ఫోన్ చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే లారీ కాలిపోయింది. టోల్ గేట్‌కు కూడా మంటలు వ్యాపించడంతో దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Must Read ;- విశాఖలో మరో ప్రమాదం : సింహాచలం సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం