(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలోని హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.సుమారు10 మంది కార్మికులు ఆ ప్రదేశం వద్ద ఉన్నట్లు సమాచారం. హెచ్‌పీసీఎల్‌లోని సిడి వన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.భారీ స్థాయిలో మంటలు చెలరేగుతున్నాయి.మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు విఫలయత్నం చేస్తున్నాయి.పరిసర ప్రాంతాలకు భారీగా ఎగసిపడుతున్న నల్లని పొగలు కనిపిస్తుండడంతో ప్రజలు ఆందోళనతో సమాచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కొత్త చిమ్నిలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.దీంతో అప్రమత్తమైన యజమాన్యం అత్యవసర సైరెన్ మోగించి ఉద్యోగులను అందరిని బయటకు వెళ్లాలని అప్రమత్తం చేసింది.
Must Read ;- విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల దీక్షా శిబిరం దగ్దం











