ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడుల్లో రాజకీయ నేతల ప్రమేయం ఉందని తేలినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. దేవాలయాలపై జరిగిన దాడులను ఛేదించేందుకు సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసిందని డీజీపీ మంగళగిరిలో తెలిపారు. కుట్రకోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు. 9 దేవాలయాలపై దాడుల్లో 21 మంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని సవాంగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో దేవాలయాలపై జరిగిన దాడులపై అసత్య ప్రచారం జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్ర స్పష్టంగా ఇందులో కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
అదుపులో 81 మంది
దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం కేసుల్లో ఇప్పటి వరకు 81 మందిని అదుపులోకి తీసుకున్నట్టు డీజీపీ చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు మతద్వేషాలు రెచ్చగొట్టి దుష్ప్రచారం చేశాయని సవాంగ్ తెలిపారు. విధ్వేషాలు రెచ్చగొట్టి, అల్లర్లు సృష్టించాలని చూసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని డీజీపీ తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపేడేందుకు కృషి చేస్తున్నట్టు డీజీపీ గుర్తు చేశారు.
Must Read ;- మతం రంగు పులమద్దు : డీజీపీసవాంగ్











