నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందే!
ఏపీలో కొత్త జిల్లాల అంశం ప్రాంతాల మధ్యే కాదు, అధికారపార్టీ నేతల మధ్య అఘాతాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పలువురు పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి.. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమండ్ చేస్తున్నారు. బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీమంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు పాల్గొన్నారు. బ్యాక్ ర్యాలీ అనంతరం వేదికపై కొత్తపల్లి సుబ్బారాయుడు సొంత పార్టీపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. తన నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి తప్పు చేశారని తన చెప్పుతో తానే కొట్టుకోవడం పెద్ద చర్చకు దారి తీస్తోంది! ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజు దూరంగా ఉండటంపై మండిపడ్డారు. అసమర్ధుడిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు తన చెప్పుతో తాను కొట్టుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జిల్లాల పునర్విభజన ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా జరుగతోంది. ప్రజాభిప్రాయాలను, నేతల డిమాండ్స్ పై ఇన్పుట్స్ తీసుకుంటున్నారే కానీ..అవి బుట్టదాఖాలు కావడం ఖాయమన్న విమర్శలు కూడా లేకపోలేదు. ప్రజల విజ్ఞాపనలను లక్ష్యపెట్టకుండా జిల్లా పునర్విభజన సాగుతోందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వైసీపీ నేతలు, విపక్షాలు పలువురు మండిపడుతున్నా.. జగన్ రెడ్డి మరో ఆలోచన లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపే ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలలో పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది!
Must Read:-జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ దండయాత్ర..!











