$24000 Funds Raised For Crying German Girl When Germany Defeated By England In Football :
తమ దేశం వాళ్లు ఫుట్‌బాల్‌లో ఓడిపోవడంతో ఆ పాప ఏడ్చేసింది. దీంతో విజేతలయిన వారు భారీ పండ్ సేకరించి తమ దేశం వాళ్లు మంచి వారేనన్న అభిప్రాయాన్ని కలిగించటానికి ప్రయత్నించారు. ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏడుపుకు కారణం ఇదే..
వెంబ్లేలో జరిగిన యూరో 2020 ఫుట్‌బాల్ రౌండ్ 16లో జర్మనీ ఇంగ్గాండ్ చేతిలో 2-0 స్కోరుతో పరాజయం పొందింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఆ పాప ఏడ్చేసింది. ఆ పాప ఏడ్పులు హైలెట్ కావడంతో ఇంగ్లాండ్ అభిమానులను కదిలించాయి.ఇంగ్లాండ్‌కు చెందిన వారందరూ చెడ్డవారు కాదన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు వెబ్ డెవలపర్ అయిన జోయిల్ హూగెస్ అనే ఫుట్‌బాల్ అభిమాని ఆ పాప కోసం ఫండ్ సేకరించాలని తలపెట్టారు. ఆయన 500 ఫౌండ్లు టార్గెట్‌గా నిర్ణయించగా 2300 మంది స్పందించి మూడు రోజుల్లోనే 24,000 ఫౌండ్లు సమకూర్చారు. ఆ పాపకు మంచి అభిప్రాయం కలిగించేందుకే ఇంత మంది స్పందించారని జస్ట్ గివింగ్ పేజీలో జోయల్ పేర్కొన్నారు. ఇంగ్లాండ్ దేశీయులు అందరి గురించి ఆలోచిస్తారనే విషయం తెలిసేలా ఈ ఫండ్‌తో తల్లిదండ్రులు ఆ పాపకు మంచి ట్రీట్ ఇవ్వాలని జోయల్ అన్నారు. అంతే కాకుండా ఈ ఫండ్ ప్రపంచాన్ని మారుస్తుందని అనుకోవడం లేదని, ఆ పాపకు కొంత ఊరట కలుగుతుందని అనుకుంటున్నట్లు తెలిపారు. దీని గురించి చెడుగా రాసిన వాళ్లకు కనివిప్పు కులుగుతుందని, ఆ పాప ముఖంలో చిరునవ్వు చూడవచ్చని తాను భావిస్తున్నట్లు జోయల్ ఓ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఫండ్ అందజేయడానికి ఆ పాప, ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఫండ్ స్వీకరించటానికి వారు అంగీకరించకపోతే ఆ సంఘటనను గుర్తు ఉంచుకునేలా ఉండే మంచి కార్యక్రమానికి విరాళం ఇస్తానన్నారు.
55 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ విజయం..
ఎన్నోసార్లు పరాజయం తర్వాత మంగళవారం నాడు వెంబ్లేలో జర్మనీపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. 1966 ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్రధాన టోర్నమెంట్‌లో నౌక్ ఔట్ దశలో ప్రధాన ప్రత్యర్థులపై ఇంగ్లాండ్ విజయం సాధించింది.
Must Read ;- చరిత్ర సృష్టించబోతున్న తెలుగు అమ్మాయి.. అంతరిక్షంలోకి అడుగిడుతున్న శిరీష బండ్ల
— James John (@JamesJohn2427) June 30, 2021











