మేయర్ పీఠం కోసం టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పోటీ పడ్డాయి. కాంగ్రెస్ కార్పొరేటర్లు మేయర్ ఎన్నికను బహిష్కరించారు. టీఆర్‌ఎస్ మేయర్ అభ్యర్థిగా గద్వాలా విజయలక్షీ, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతె శ్రీలత బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో.. మేయర్ పీఠాన్ని ఆశించిన టీఆర్‌ఎస్ కార్పొరేటర్ పిజేఆర్ విజయారెడ్డి, సమావేశ కార్యలయం నుండి వెళ్లిపోయారు. 149 కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం పూర్తయింది. రాధా ధీరజ్ రెడ్డిని మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిపింది బీజేపీ పార్టీ. ఎంఐఎం కూడా తమ అభ్యర్థిని నిలబెడతారని ఊహాగానాలు సాగినా.. వారు మేయర్ అభ్యర్థిని నిలబెట్టలేదు.
కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 193 మంది సభ్యులున్నారు. ఇందులో 149 మంది కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు 44 మంది. మేయర్ ఎన్నికకు 97 సభ్యుల హాజరు అవసరం ఉంటుంది. వీటిలో 56 మంది కార్పొరేటర్లు, 32 మంది ఎక్స్అఫీషియో సభ్యులను కలుపుకుని టీఆర్‌ఎస్ బలం 88. కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు కలుపుకుని బీజేపీకి 49 మంది ఉన్నారు. ఇక ఎంఐఎం విషయానికొస్తే.. మొత్తంగా 54 మంది సభ్యులు ఆ పార్టీ ఖాతాలో ఉన్నారు.
టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతుగా నిలవడంతో.. గద్వాల విజయలక్ష్మీ మేయర్‌గా ఎంపికయ్యారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మోతె శ్రీలత ఎంపికయ్యారు. గద్వాల విజయలక్ష్మీ బంజారా హీల్స్ నుంచి రెండో టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌గా ఎంపికయ్యారు. ఎల్ ఎల్ బీ, జర్నలిజం చేసిన విజయలక్ష్మీ.
Must Read ;- చక్రం తిప్పిన కేకే.. మేయర్ అభ్యర్థి ఆయన కుమార్తె విజయలక్ష్మి











