ఏపీలో రాజ్యాంగం అమలు కావడం లేదని,ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించాలని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు.ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న మీడియాపైనా కేసులు పెట్టడం అప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు.మీడియాపై కేసులు పెట్టడం అంటే భావప్రకటనా స్వేచ్ఛపై దాడి చేయడమేనని ఆయన అన్నారు. తక్షణమే మీడియాపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
జగన్ పీనల్ కోడ్ అమలవుతోంది
ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్ బదులు,జగన్ పీనల్ కోడ్ అమలవుతోందని తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.జగన్ పాలన కంటే బ్రిటిష్ వారి పాలన మెరుగనిపించే విధంగా ఏపీలో పాలన సాగుతోందన్నారు.ఆర్టికల్ 19 ద్వారా ప్రతి వ్యక్తికి రాజ్యాంగం ద్వారా భావప్రకటన స్వేచ్ఛ కల్పించారని,దానిపై దాడి చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు.ఎంపీ రఘురామరాజును అక్రమంగా అరెస్టు చేయడం,కస్టడీలో దారుణంగా కొట్టడం గర్హనీయమన్నారు.ఇలాంటి కక్షపూరిత, అప్రజాస్వామిక, అమానుష చర్యలను తులసిరెడ్డి ఖండించారు.
Must Read ;-పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామరాజు లిఖిత పూర్వక ఫిర్యాదు.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్











