సీఐడీ రిమాండు రిపోర్టు తప్పుల తడకగా రాయడంతో గుంటూరులోని ఆరవ అదనపు కోర్టు న్యాయమూర్తి తిప్పిపంపారు.మరలా రిమాండు రిపోర్టును సరిచేసి న్యాయమూర్తికి సమర్పించారు.తనను పోలీసులు కొట్టారని ఎంపీ రఘురామరాజు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వెంటనే వైద్య సేవలు అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
హైకోర్టులోని స్పెషల్ డివిజన్ బెంచ్‌లో విచారణ
హైకోర్టులోని స్పెషల్ కోర్టులో ఎంపీ రఘురామరాజు తరఫు న్యాయవాది ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు.ఒక ఎంపీని ఇలా కొట్టడం రాజ్యాంగ విరుద్దమని ఆదినారాయణరావు పిటీషన్లో వివరించారు. ఈ కేసు విచారణకు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలిత నేతృత్వంలో స్పెషల్ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేశారు.ఈ కేసును ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
శరీరంపై గాయాలు
సీఐడీ అరెస్టు చేసి విచారించిన ఎంపీ రఘురామకృష్ణరాజు కాళ్లకు, శరీరంపై గాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు కొట్టారంటూ ఎంపీ రఘరామరాజు న్యాయమూర్తికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
Must Read- నా తండ్రిని పోలీసులు కొట్టారు.. కేంద్ర హోంశాఖకు RRR కుమారుడు భరత్ లేఖ;