పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ను వాయిదా వేసుకున్న ఈ సినిమాలు మూడూ .. హైద్రాబాద్ లో తిరిగి చిత్రీకరణ జరుపుకోనున్నాయి.
ఇక వీటిలో ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించిన ఓ అప్టేడ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో మేఘనాధుడి పాత్ర కు బిగ్ బాస్ 13 విన్నర్ సిద్ధార్ధ్ శుక్లా నటిస్తున్నాడట. బాలీవుడ్ లో సిద్ధార్ధ్ 2,3 సినిమాలు చేసినా.. బిగ్ బాస్ విన్నర్ గానే అతడు ఫేమస్. ఆ క్రేజ్ తోనే అతడ్ని మేఘనాధుడి పాత్రకు ఎంపిక చేశాడట దర్శకుడు ఓం రౌత్.
రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, లక్షణుడిగా సన్నీ సింగ్ , రావణుడిగా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్న ఈ సినిమా దాదాపు రూ. 500కోట్ల భారీ బట్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమా కాబోతోంది.
Must Read ;- ఒకే లొకేషన్ లో ప్రభాస్ మూడు సినిమాల చిత్రీకరణ