హనుమంతుడి జన్మస్థలంపై వివాదం కొనసాగుతూనే ఉంది.హనుమంతుని జన్మస్థలం తిరుపతిలోని అంజనాద్రే అంటూ టీటీడీ దేవస్థానం అధికారికంగా ప్రకటించడం వివాదానికి కారణమైంది.హనుమంతుడి జన్మస్థలం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పిన దాంట్లో ప్రామాణికత లేదని గోవిందానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమంతుడు జన్మించిన కాలం విషయంలో స్పష్టత లేదు,మూడు తిథులు రాశారు,జన్మతేదీ లేనప్పుడు స్థలం ఎలా నిర్ణయిస్తారని ఆయన తిరుపతిలో ప్రశ్నించారు.పురాణాలతో హనుమంతుని జన్మస్థలం తేల్చలేరని గోవిందానంద సరస్వతి అభిప్రాయపడ్డారు.
రామాయణమే ప్రామాణికం
హనుమంతుడి జన్మస్థలం విషయంలో రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని గోవిందానంద సరస్వతి కోరారు. టీటీడీ వారు హనుమంతుని జన్మస్థలం విషయంలో చర్చను పబ్లిగ్గా పెట్టాలి.ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పంపాకు ఏదైనా కమిటీ వచ్చిందా అన్నారు.పీఠాధిపతుల సమక్షంలో మాత్రమే తేల్చాలన్నారు.ఎవరుపడితే వారు కమిటీలు వేసి నిర్ణయాలు ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు.విజయవాడలో కూడా అయోధ్య కాలనీ ఉంది,అంత మాత్రాన అది అయోధ్య అవుతుందా? కర్ణాటకలో అంజనాద్రి ఉంది,ఆ ప్రభుత్వాన్ని ఏమైనా వివరాలు అడిగారా అంటూ గోవిందానంద సరస్వతి ప్రశ్నించారు.హనుమంతుని జన్మస్థలం తేల్చే విషయంలో శంకర,రామానుజ,మద్వ పీఠాలను, పీఠాధిపతులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలని గోవిందానంద సరస్వతి డిమాండ్ చేశారు.
Must Read ;- అంజనాద్రి హనుమ.. రాబోయే కల్పానికి బ్రహ్మ











