హిందువుల ఆరాధ్య దైవం, శ్రీరాముడి ప్రియభక్తుడు హనుమంతుడి జన్మస్థలం గురించి గతకొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా… అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాలతో సహా నిరూపితమైనట్లు టీటీడీ పేర్కొంది. ద్వారకా పీఠాధిపతి కర్ణాటకలోని హంపి ప్రాంతం ఆంజనేయుని జన్మస్థలంగా ప్రస్తావించారు. అయితే దీనికి ఎలాంటి ప్రమాణాలూ టీటీడీ స్పష్టం చేసింది. ఇతిహాసాలు, పురాణాలను క్షుణంగా పరిశీలించడంతో పాటు శాస్త్రవేత్తల ద్వారా లాట్యుట్యూడ్స్, లాంగ్యిట్యూడ్స్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని టీటీడీ ప్రకటన చేసింది.
Must Read ;- అలిపిరి వద్దే గదుల వివరాలు.. భక్తులకు టీటీడీ శుభవార్త