పదవీ విరమణ చేసిన అర్చకులు తిరిగి విధుల్లోకి చేరేందుకు అవకాశం కల్పిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ నిర్ణయంతో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుతో పాటు పలువురు అర్చకులకు అవకాశం కలగనుంది. 2018, మే16న అర్చకుల పదవీ విరమణపై టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయస్సును నిర్థారించి అది దాటిన వారంతా విరమణ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నలుగురు ప్రధాన అర్చకులతో పాటు మరికొంత మంది పదవీ విరమణ చేశారు. దీనిపై అర్చకులు కోర్టును ఆశ్రయించగా శారీకంగా అరోగ్యంగా ఉన్న వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. తాజాగా వారందరికి అవకాశం కల్పిస్తూ టీటీడీ ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read:అలిపిరి వద్దే గదుల వివరాలు.. భక్తులకు టీటీడీ శుభవార్త











