మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ చతికిలపడ్డా తాడిపత్రిలో మాత్రం సగం డివిజన్లు గెలుచుకోగలిగారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లను కాపాడుకోవడం ఆ పార్టీ నేతలకు సవాల్‌గా మారింది. తాడిపత్రిలో టీడీపీ నుంచి గెలిచిన 18 మంది కౌన్సిలర్లను జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డి రహస్య ప్రదేశానికి తరలించారు. వైసీపీ నాయకులు టీడీపీ కౌన్సిలర్లను బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి అరాచకాలకు పాల్పడతారనే అనుమానంతోనే కౌన్సిలర్లను రహస్య ప్రదేశానికి తరలించారని తెలుస్తోంది. టీడీపీ నుంచి గెలిచిన కౌన్సిలర్లను వెంటబెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి హైదరాబాద్‌లోని రహస్య ప్రాంతాలకు వెళ్లారని తెలుస్తోంది.
తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగిరేనా..
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో 36 డివిజన్లకు గాను 18 డివిజన్లలో టీడీపీ, 16 డివిజన్లలో వైసీపీ, ఒక డివిజన్ లో ఇండిపెండెంట్, మరో డివిజన్ లో సీపీఐ అభ్యర్థి గెలిచారు. ఎక్స్ అఫీసియో మెంబర్లతో తాడిపత్రి, మైదుకూరులను కూడా వైసీపీ కైవసం చేసుకుంటుందని ఇప్పటికే మంత్రి బొత్స ప్రకటించారు. దీంతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అప్రమత్తం అయ్యారు.
Must Read ;- తాడిపత్రిలో నలుగురి ఎమ్మెల్సీల ఎక్స్ అఫిషియో ఓట్లు తిరస్కరణ