పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా .. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కోర్ట్ రూమ్ డ్రామా వకీల్ సాబ్ . బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు మేకర్స్. ఇంతకు ముందు రెండు లిరికల్ సాంగ్స్, టీజర్ విడుదల కాగా.. పవర్ స్టార్ అభిమానుల్ని అవి విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే.. సినిమామీద అంచనాలు మరింతగా పెరిగాయి.
ఇక ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమాకి సంబంధించిన మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. కంటిపాప కంటిపాప అంటూ సాగే ఈ పాట.. చాలా మెలోడియస్ గా ఉంది. తమన్ స్వరపరిచిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఈ పాట పవన్, శ్రుతి హాసన్ మీద చిత్రీకరించారు. ముగ్గురమ్మాల మీద ఫైల్ చేయబడిన ఓ కేస్ ను వకీల్ సాబ్ వాదించి .. వారికి న్యాయం చేయడమే సినిమా కథ. పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని .. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాను రూపొందించారు.
Must Read ;- న్యూ పోస్టర్ : మహిళలతో ‘వకీల్ సాబ్’