డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ ఎర్లియర్ గా అనుష్క, రానా లతో ‘రుద్రమదేవి’ సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించాడు కూడా. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. దాని కొనసాగింపుగా ప్రతాపరుద్రుడు తెరకెక్కించాలనుకున్న గుణశేఖర్ అనూహ్యంగా.. రానాతో ‘హిరణ్యకశ్యప’ అనే టైటిల్ తో భారీ సినిమాను తెరకెక్కించాడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ప్రీప్రొడక్షన్స్ మాత్రమే కంప్లీట్ చేసి.. సినిమా సెట్స్ కు వెళ్ళడానికి మరింత టైమ్ పట్టేలా ఉండడంతో.. ఇటీవల ‘శాకుంతలం’ అనే సినిమాను తీయబోతున్నట్లు గుణశేఖర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల రమణీయ ప్రణయగాథ ఈ సినిమాకి ఆధారం అని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీయబోతున్నాడు గుణశేఖర్. దీంతో గుణశేఖర్ మొదట ప్రకటించిన ‘హిరణ్యకశ్యప’ సినిమాను పక్కన పెట్టాశాడు అంటూ ఫిలింనగర్ లో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు గుణశేఖర్ ను అడగగా ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని పక్కా క్లారిటి ఇచ్చారయిన.
ఆ సినిమాను కచ్చితంగా తెరకెక్కిస్తానని, అందులో మరో ఆలోచన లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు గుణశేఖర్. ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని ఎక్కువ మందితో షూటింగ్ చేయాలని, ఈ సినిమాకు భారీ సెట్లు అవసరమని అన్నారు. ఈ టైములో ‘హిరణ్యకశ్యప’ సినిమా తెరకెక్కించడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. ‘శాకుంతలం’ సినిమా అయితే తక్కువ మందితో షూట్ చేయవచ్చని చెప్పారు. ముందుగా ‘శాకుంతలం’ సినిమాను తెరకెక్కించి ఆ తర్వాత ‘హిరణ్యకశ్యప’ సినిమాను తీస్తానని గుణశేఖర్ క్లారిటీ ఇచ్చారు.











