అమెరికా ప్రతినిధుల సభకు రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న మహిళ మరెవరో కాదు. మన తెలుగింటి ఆడపడుచు మంగ అనంతాత్ముల ఈమె ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. విద్యాభ్యాసాన్ని చెన్నైలో పూర్తి చేశారు. 30 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి ఈమె అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ రక్షణ కొనుగోళ్లు విభాగంలో ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టరుగా వ్యవహరించారు.
ప్రస్తుతం జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో మంగ అనంతాత్ముల రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచున్నారు. ఇప్పటి వరకు అమెరికా ఎన్నికల్లో భారతీయ మహిళలు నిల్చున్నప్పటికీ మంగ అనంతాత్ముల ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కావడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయం ఆమెను వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలలో ఆమె కనుక గెలిస్తే సభలో మొట్టమొదటి రిపబ్లికన్ ఇండియన్ అవుతుంది.











