తప్పుడు కేసు నమోదు చేస్తే ఎలా?
అధికార పార్టీ ఎమ్మెల్యే తనవైపు ఉన్నాడు.. నాకు పోస్టింగ్ ఇచ్చారు. చేసే అవినీతికి, అక్రమాలకు అడ్డుపడి రక్షిస్తారులే అన్న వెర్రి తలకెక్కితే.. ఏ పోలీసు అధికారికి అయిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ కు పట్టిన గతి పడుతోందన్నది అక్షర సత్యం! మొన్న ఈ మధ్య శావల్యపురం మండాలనికి చెందిన వైసీపీ నాయకుడు, రైతు నరేంద్రపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బూతులు తిడుతూ.. చెప్పుతో కొట్టబోయారు. అలా నరేంద్రపై ఊరి ప్రజల ముందు కాలుకున్న చెప్పు తీసి కొట్టబోయి అవమానించడమేకాక, తిరిగి అతనిపై అక్రమ కేసు కట్టించాడు బొల్లా. ఎమ్మెల్యే ఆదేశాలను శిరోధార్యంగా భావించి సీఐ అశోక్ కుమార్ అత్యుత్సహంతో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నరేంద్ర పై అక్రమ కేసు పెట్టారని మీడియా ప్రముఖంగా వార్తలను ప్రచురించింది. సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది! దీంతో రూరల్ ఎస్పీ విశాల్ విచారణకు అడిషనల్ ఎస్పీని ఆదేశించారు. ఈ విచారణలో నరేంద్రపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని తేలడంతో సీఐపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. మరి సదరు సీఐ సస్పెన్షన్ ను ఎమ్మెల్యే బొల్లా అరచేయి అడ్డుపెట్టి ఎందుకు రక్షించలేక పోయాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెలుస్తున్నారు. సొంత పార్టీ నేతలపై నోరుపారేసుకుంటూ.. చెప్పులతో దాడి చేస్తే.. పార్టీ నేతలే కాదు.. ప్రజలు కూడా ఛీ కొడతారన్న సత్యం ఇప్పటికైన బోధపడితే బాగుంటుందని నెట్టింటి జనులు హితబోధ చేస్తున్నారు.