‘ఆంధ్రాపోరి’ తో టీనేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ‘మెహబూబా’ మూవీతో పూర్తి స్థాయి హీరోగా ఎలివేట్ అయ్యాడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ. తొలి రెండు సినిమాలతోనూ పెద్ద గా సక్సెస్ సాధించ లేకపోయాడు. కానీ హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు ఆకాశ్ పూరీ ముచ్చటగా మూడో సినిమా ‘ రొమాంటిక్’ తో వస్తున్నాడు. ఈ మూవీకి పూరీ కథ, స్ర్కీన్ ప్లే, మాటలు అందించి.. దర్శకత్వ బాధ్యతలను శిష్యుడైన అనిల్ పాడూరికి అప్పగించాడు. ఆకాశ్ సరసన ముంబై బ్యూటీ కేతికా శర్మ కథానాయికగా నటిస్తోంది.
2019లో సెట్స్ మీదకు వెళ్ళిన ‘ రొమాంటిక్’ మూవీ ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రొమాంటిక్ మూవీకి రిలీజ్ డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 18న ప్రపంచ వ్యాప్తందగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు. ఇప్పటికే రొమాంటిక్ మూవీకి సంబంధించిన పోస్టర్స్ , సాంగ్స్ విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన రొమాంటిక్ మూవీ .. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుండగా.. మరాఠీ నటుడు మకరంద్ దేశ్ పాండే మరో ముఖ్యమైన రోల్ చేస్తున్నాడు. మరి ఈ మూవీ ఆకాశ్ కు ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.
𝐉𝐮𝐧𝐞 𝟏𝟖𝐭𝐡 𝟐𝟎𝟐𝟏
Theatres Will Get #Romantic with @ActorAkashPuri & #Ketikasharma's Exotic Fascination 🔥
@meramyakrishnan ‘s power packed performanceProduced by #PuriJagannadh @Charmmeofficial ♥️
Directed by @anilpaduri @PuriConnects #PCfilm 💕 @balu_munnangi pic.twitter.com/UJ5FOWdDAz— Charmme Kaur (@Charmmeofficial) March 1, 2021