నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో నాని మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల రేట్లును తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇంతకీ నాని ఏమన్నారంటే.. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ టిక్కెట్ల రేట్టు ఉన్నాయని అన్నారు. ‘ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉంది. టికెట్ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే.. నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది’ అని నాని వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు తగ్గింపు పై ఇండస్ట్రీ అంతా వ్యతిరేకంగానే ఉంది కానీ.. ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఇలాంటి టైమ్ లోనాని ఒక అడుగు ముందుకు వేసి టిక్కెట్ల తగ్గింపు పై తను ఏదైతే ఫీలయ్యాడో అదే విషయాన్ని ధైర్యంగా బయటపెట్టాడు. నాని వ్యాఖ్యలను వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు. సంక్రాంతికి భారీ సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతుండడంతో ఈ వివాదం ఎటు వైపు వెళ్లనుంది..? ఏం జరగనుంది..? అనేది ఆసక్తిగా మారింది.











