సంగం డెయిరీలో అవినీతి ఆరోపణలపై అరెస్టైన దూళిపాళ్ల నరేంద్ర, తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఏసీబీ కేసులో దాఖలైన పిటిషన్‌లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 5వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
సంగం డెయిరీ వ్యాపార కార్యకలాపాల్లో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్టు చేసి, కోర్టు తీర్పు మేరకు 14 రోజులు రాజమండ్రి జైలుకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ నరేంద్రకు చుక్కెదురైందని చెప్పవచ్చు. దూళిపాళ నరేంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.
Must Read ;- సంగం డెయిరీ ప్రభుత్వ స్వాధీనంపై కోర్టుకెక్కిన డైరెక్టర్లు