విక్టరీ వెంకటేశ్ హీరోగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ మూవీ ‘నారప్ప’. తమిళ సూపర్ హిట్ ‘అసురన్’ కి రీమేక్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రియామణి కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కు మంచి రెస్సాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
చిత్రీకరణ చివరి దశకి చేరుకున్న ఈ సినిమాకి మే 14న విడుదల తేదీని ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ .. ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
‘నారప్ప’ సినిమాను ఎంతో అంకిత భావంతో తెరకెక్కిస్తున్నాం. ఈ ప్రేమాభిమానాలు, అందించిన సపోర్ట్ తో ఇప్పటివరకూ సినిమాను విజయవంతంగా రూపొందించాం. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తో దేశం అట్టుడికిపోతోంది. ఈ పరిస్థితుల్లో మా సినిమాను అనుకున్న విడుదల తేదీలో విడుదల చేయలేకపోతున్నాం. పరిస్థితి చక్కబడిన తర్వాత మంచి టైమ్ చూసుకొని నారప్ప సినిమాను విడుదల చేస్తాం. ఇంటి వద్దనే క్షేమంగా ఉండండి . మాస్క్ ధరించండి. అంటూ నిర్మాతలు తెలిపారు.
Must Read ;- సెకండ్ వేవ్ కారణంగా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ నిలిపివేత
In lieu of the pandemic, #Narappa will not be releasing on May 14th . A new theatrical date will be announced once we overcome this unprecedented crisis.
Stay safe 🙏! #NarappaPostponed#Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @SureshProdns @theVcreations pic.twitter.com/7QWIL8lOG6— Venkatesh Daggubati (@VenkyMama) April 29, 2021