వైసీపీ ప్రభుత్వం రాఘురామరాజు పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందంటూ రఘురామ కుటుంబ సభ్యులు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత రాజ్ నాథ్ సింగ్ తోనూ చర్చలు జరిపారు. తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను రఘురామరాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె బిందూ కలిశారు. వైసీపీ ప్రభుత్వం నుంచి రఘురామరాజుకు ప్రాణహాని ఉందని, జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు ఓ వినతిపత్రం అందించారు.
Must Read ;- ‘అమిత్ షా అనుమతితోనే రఘురామ అరెస్ట్‘ : సీపీఐ నేత నారాయణ కామెంట్స్!











