ఈ రోజుల్లో చాలామంది బ్లాక్ హెడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇవి రోజురోజుకూ ఎక్కువ కావడంతో పాటు అందాన్ని మరింత తగ్గిస్తాయి. బ్లాక్ హెడ్స్ లేకుండా ఉండాలంటే.. టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టిలో బేకింగ్ సోడా, చార్‌కోల్, కొద్దిగా రోజ్‌వాటర్ లేదా మినరల్ వాటర్ వేసి కలపాలి. ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. బ్లాక్ హెడ్స్ తో పాటు కొందరిని మొటిమలు, మచ్చలు కూడా వేధిస్తుంటాయి. అప్పుడు.. గంధం పొడి, రోజ్‌వాటర్, వేప ఆకుల పొడిని ముల్తానీ మట్టిలో వేసి మెత్తని మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.
Must Read ;- రాగి జావ తాగితే.. రోగాలు పరార్!











