విమర్శలకు వివాదాలేందుకు?
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పై జగన్ రెడ్డి ప్రభుత్వం కక్షకట్టింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అధికార వైసీపీ నాయకులు వాడుతున్న పరుషపదజాలాన్ని మొదటి నుంచి అయ్యన్న ఖండిస్తునే వస్తున్నారు. తనదైన ఉత్తరాంధ్ర యాసతో ఛలోక్తులు వదులతూ.. పంచ్ డైలాగులతో విమర్శలు గుప్పిస్తునే వస్తున్నారు. అంతేకానీ నోటికి ఎంతోస్తే అంత మాట అనడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, ఇంట్లో ఉన్న ఆడవారిని దూషించడం వంటివి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయరు. నల్లజర్ల కార్యక్రమంలో కూడా అయ్యన్న విమర్శనాస్త్రాలు ప్రయోగించారే తప్ప.. వ్యక్తి దూషణలకు దిగలేదు. రాజకీయ విమర్శను కూడా కేవలం సూటీగా ప్రశ్నిస్తున్నట్లు వ్యాఖ్యలు మాత్రమే చేశారు. కానీ అధికారపార్టీ నేతల కుటుంబ సభ్యులను, ప్రభుత్వాన్ని, జగన్ ను వ్యక్తిగతంగా దూషించడం వంటివి చెయ్యలేదు. కేవలం ప్రశ్నిస్తున్నారనే నేపంతో కక్షసాధింపు చర్యలకు దిగింది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగానే అయ్యన్న పై అక్రమ కేసులు బనాయించారని తెదేపా నేతలు మండిపడుతున్నారు.
దూకుడు చర్యలు ఆపండి..
సీఎం జగన్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేశారని పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేత రామకృష్ణ ఫిర్యాదు మేరకు నల్లజర్ల సీఐ రఘు తన సిబ్బందితో నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అయ్యన్న ఇంట్లో లేరని చెప్పినా.. పోలీసులు అయ్యన్న బయటకు రావాలని ఇంటి బయటే కూర్చోని అర్థరాత్రి వరకు వేచి చూశారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలు ఇంటిని మోహరించాయి. అయ్యన్న కనిపిస్తే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ప్రవర్తనను టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. పెద్ద సంఖ్యలో అయ్యన్న ఇంటివద్దకు చేరుకుని పోలీసుల తీరును ప్రశ్నించారు. మరోవైపు అయ్యన్న పాత్రుడు తరుపు న్యాయవాది సతీష్ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు అయ్యన్న పై నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలకు పోలీసులు ఉపక్రమించవద్దని ఆదేశించింది. పోలీసు చర్యలపై స్టే విధించింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని సూచించింది. సీఎంను దూషించారన్న ఫిర్యాదు మేరకు 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన సంగతి విదితమే!
Must Read:-అహంకారానికి – ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం! అయ్యన్న ఇంటి వద్ద హైటెన్షన్!!











