ముదురుతున్న విగ్రహ పంచాయితీ!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో విగ్రహ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాట యుద్ధం తారాస్ధాయికి చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండి రామిరెడ్డి విగ్రహాన్ని పెద్దారెడ్డి అనుచరులు ఆవిష్కరించారు. అయితే మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల కౌన్సిస్ సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. ఈ విషయాన్ని మున్సినల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలెక్టర్ నాగలక్ష్మీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో పెద్దారెడ్డి మరో వివాదానికి తెరదీశారని, సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఎలా బేఖాతరు చేస్తారంటూ టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.
మీ నాన్న ఫ్రీడమ్ ఫైటరా?
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దుందుడుకు నిర్ణయాలు చల్లారని పగలు సైతం ఒక్కసారిగా బుస్సుమంటున్నాయి. తన తండ్రి రామిరెడ్డి విగ్రహ ఏర్పాటు విషయంలో నిబంధనలు ఫాలో అయితే ఈ వివాదానికి తావుండే కాదు. అధికారం ఉంది కదా.. ఏం చేసిన చెల్లుబాటు అవుతోందని భావించి, ఏకంగా నేషనల్ హైవే పై విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగించారు పెద్దారెడ్డి అండ్ కో. ఈ చర్యలనే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నేషనల్ హైవేలో విగ్రహాలు ఎలా పెడతారని జేసీ ప్రభాకర్ నిలదీశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి ప్రజలకు ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అలానే ఆయనేమైన స్వాతంత్య్ర సమర యోదుడా? దేశం కోసం పోరాటం చేశాడా? అని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఏం మంచి చేశాడో పెద్దారెడ్డి చెప్పాలన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ అయిన తన తండ్రి జేసీ నాగిరెడ్డి, దేశం కోసం జైలుకు కూడా వెళ్లారన్నారు. అటువంటిది ఆయన విగ్రహమే పెట్టలేదని గుర్తు చేశారు. ఏదీఏమైనా కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం పెట్టి తీరుతామని పెద్దారెడ్డి అనుచరులు చెప్పడంతో తాడిపత్రి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆధిపత్య రాజకీయాలు కోసమే విగ్రహ ఏర్పాటు వివాదమని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు!
Must Read:-కాంగ్రెస్ గతే.. వైసీపీకి పడుతోంది! సంచలన ఆరోపణలు చేసిన ఆనం!