సౌత్ బ్యూటీ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఆరేళ్ళు గా డేటింగ్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్న ఈ జంట .. త్వరలోనే పెళ్ళిపీటలెక్కబోతున్నారనే రూమర్స్ వినిపిస్తుండగా.. మరో పక్క వీరిద్దరి మ్యారేజ్ ఎప్పుడో అయిపోయిందనే టాక్సూ స్ప్రెడ్ అవుతున్నాయి.
ప్రతీసారీ ఈ జంట ప్రేమ యాత్రలు చేయడం కోలీవుడ్ లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకు ముందు అమెరికాలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ దేశంలోనే ఇతర నగరాలకు వెళ్ళేందుకు ప్రైవేట్ జెట్ వాడడం .. ఆ ప్రయాణానికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా మరోసారి ఈ ప్రేమ పక్లులు ప్రైవేట్ జెట్ మీద కొచ్చీకి విహార యాత్రం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రతీసారీ ఈ జంట.. ప్రైవేట్ జెట్ ను కార్ లా వాడేస్తోంది అనే వ్యాఖ్యలు ఫ్యాన్స్ మధ్య జోరుగా వినిపిస్తున్నాయి. గంటల వ్యవధిలోని ప్రయాణానికి లక్షల్లో ఖర్చు అయ్యే ప్రైవేట్ జెట్ ప్రయాణం.. నయన్, విఘ్నేష్ లకు పెద్ద ఖర్చులా అనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రతీసారి ఏదో విహారానికి ప్రేవేట్ జెట్ ను తెగ వాడేస్తుండడం నిజంగా షాకింగ్ వ్యవహారమే.
సాధారణంగా బిజినెస్ పీపుల్, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు .. అర్జెంట్ అనుకున్న సందర్భంలోనే ప్రైవేట్ జెట్ ను వాడుకుంటారు. కానీ నయన్, విఘ్నేష్ లు అయిన దానికీ కానిదానికీ ప్రైవేట్ జెట్ నే ఆశ్రయిస్తుండడం సౌత్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మరి ఇప్పుడింకా పెళ్ళవకుండానే.. భూమ్మీదే విహరించడం మానేసిన ఈ ప్రేమ జంట.. పెళ్ళయ్యాకా.. అంతరిక్షంలో విహరిస్తారేమో అని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనం. మరి ఈ ప్రేమ జంట.. ఆ విషయం కూడా ఆలోచిస్తుందేమో చూడాలి.
Must Read ;- నయన్, విఘ్నేష్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా?