అమరావతి రాజధాని వెలగపూడి గ్రామంలో రెండు కులాల మధ్య చెలరేగిన చిచ్చు ఆరలేదు. వెలగపూడి ఎస్సీ కాలనీ ఆర్చ్ నిర్మాణం, క్రిస్మస్ స్టార్ ఏర్పాటు విషయంలో మాదిగ, మాల కులస్థుల మధ్య తేడాలు వచ్చాయి. గత రెండు రోజులుగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎక్కడా ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు. గత రాత్రి అకస్మాత్తుగా మాదిగలు తమపై దాడి చేశారని మాల సామాజికవర్గం ఆరోపిస్తోంది. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రోద్బలంతోనే మాదిగలు తమపై రాళ్లదాడికి దిగారని మాలలు ఆరోపిస్తున్నారు. మాదిగల దాడిలో మాల సామాజికవర్గానికి చెందిన మరియమ్మ తీవ్రంగా గాయపడి చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెలగపూడిలో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరలా ఏక్షణంలో అయినా గొడవలు చెలరేగే సూచనలు కనిపించడంతో పోలీసులను భారీగా మోహరించారు.
నందిగం సురేష్ ను అరెస్ట్ చేయాలి
ఎంపీ నందిగం సురేష్ రెచ్చ గొట్టడం వల్లే మాదిగలు తమపై రాళ్ల దాడికి దిగారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు మరియమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ బాధితులు వెలగపూడిలో శవంతో దర్నాకు దిగారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హోం మంత్రి సుచరితను బాధితులు అడ్డుకున్నారు. ఎంపీ నందిగం సురేష్ తీరుపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
Must Read ;-ఎంపీ నందిగం సురేష్‌తో ప్రాణహాని.. సీఎం రక్షణ కోరిన బాధితుడు