హైదరాబాద్ నగరం నలువైపులా బాగా విస్తరిస్తోంది. అంతే స్పీడుతో నగరంలో కొందరు అసాంఘిక కార్యకలాపాలను పోలీసుల కళ్లుగప్పి నిర్వహిస్తున్నారు. బయట ఉండే బోర్డులకు లోపల జరిగే పనులకు ఏమాత్రం సంబంధాలు ఉండవు. తెర ముందు కనిపించేది ఒకటి తెరచాటు జరిగే భాగోతాలు మరొకటి. ఇలాంటి వాటికి వేదికలుగా కొన్ని స్పాసెంటర్లు కేంద్రం అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఓ స్పాసెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్పందించారు. గురువారం సాయంత్రం ఎస్ఆర్ నగర్‌లోని సదరు స్పా సెంటర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. సెలూన్, స్పా, మసాజ్ సెంటర్‌ను నాగేందర్ నిర్వహిస్తున్నారు. అందులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. అంటే ఆడవారితో మగవారికి మసాజ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం ఆ స్పా సెంటర్‌పై దాడులు చేపట్టారు. సెంటర్ యజమాని నాగేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇద్దరు యువతులను రక్షించారు.
ALsoRead ;-హైదరాబాద్ విశ్వ నగరమా? విషాద నగరమా?